మంగళవారం 04 ఆగస్టు 2020
Medak - Jul 05, 2020 , 00:58:09

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

  • మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌

మనోహరాబాద్‌:మహిళలు అన్నిరంగాల్లో  రాణించాలని మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని గౌతోజిగూడెం గ్రామంలో శనివారం ఆమె పర్యటించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, వైకుంఠధామం, డంపింగ్‌యార్డులను పరిశీలించారు. గ్రామంలో వంద శాతం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించుకోవాలన్నారు.  స్వచ్ఛ తెలంగాణ, హరితహారం స్ఫూర్తితో గౌతోజిగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కొంత మంది యువతులు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్‌ రేణుకుమార్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఆమె కుట్టు మిషన్లను అందజేస్తానని హామీనిచ్చారు. ఆమె వెంట ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీలత, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనంద్‌, మాజీ జడ్పీటీసీ నారాయణగౌడ్‌, వార్డు సభ్యులు ఉన్నారు. logo