
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 02: మౌలిక సౌకర్యాలు కల్పిచడం కోసం పట్టణ ప్రగతి ఎంతో దోహద పడుతుందని, ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మ న్ చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం పట్టణంలోని వార్డుల్లో పారిశుధ్య పనులతో పాటు మొక్కలు నాటారు. 15వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ వార్డు కౌన్సిలర్ గాయత్రితో కలిసి పర్యటించి వార్డులోని సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్యపనులను మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డీఈ మహే శ్, ఏఈ సిద్ధేశ్వరీ సానిటరీ ఇన్స్పెక్టర్ వనితలు పర్యవేక్షించారు.
మెదక్ రూరల్‌లో…
మెదక్ రూరల్,జూలై 2:పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీడీవో శ్రీరాములు అన్నా రు. మెదక్ మండల పరిధిలోని పాతూరు, వెంకటపూర్ , ఖాజీపల్లిల్లో ఎంపీడీవో శ్రీరాములు,గ్రామ ప్రత్యేక అధికారులు, సర్పంచ్‌లు , పంచాయతీకార్యదర్శులు పల్లె ప్రగతిలో భాగంగా పారిశుధ్యం ,అభివృద్ధి పనులను చేస్తున్నారు.ఎంపీడీవో శ్రీరాములు పాతూరులోమొక్క లు నాటుటకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.కార్యక్రమంలో సర్పంచ్ లింగమ్మ, ఎంపీవో నయీం, పంచాయతీ కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు బాలయ్య ఉన్నారు.
ఖాజీపల్లిలో
హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ స్వప్న సిద్ధిరాములు యాదవ్ , ఎక్సైజ్ ఎస్సై రహ్మద్ పాషా, రవి, ప్రశాంత్ ఆధ్వర్యంలో చెరువుకట్ట పై ఈత మొక్క లు నాటారు .
పాపన్నపేటలో
పాపన్నపేట, జూలై 2: పల్లెప్రగతి కార్యక్రమానికి ప్రజల సహకారం ఎంతగానో అవసరమని పాపన్నపేట మండల ప్రత్యేక అధికారి, డీఆర్డీఏ పీడీ భీమయ్య వెల్లడించారు. ఈ మేరకు మండల పరిధిలోని కొత్తపల్లిలో సర్పంచ్ కుమ్మరి జగన్ ఆధ్వర్యం లో రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు
మొక్కలను నాటి సంరక్షించుకోవాలి
పెద్దశంకరంపేట, జూలై2 : హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి ఇంటిముందు పండ్లు, పూల మొక్క లు నాటి వాటిని సంరక్షించుకోవాలని ఎంపీడీవో రామ్‌నారాయణ అన్నారు. మండల పరిషత్ కా ర్యాలయంలో సీసీలు, వీవోఏలకు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా మహిళల ద్వారా ప్రతి ఇంటిలో 6 మొక్క లు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో రియాజొద్దీన్, ఏపీఎం గోపాల్, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.
అల్లాదుర్గంలో..
అల్లాదుర్గం,జూలై2: పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని విజిలెన్స్ అధికారి శ్రీహరి అన్నారు.మండల పరిధిలోని బహిరన్‌దిబ్బ లో ఆయన పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటా ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో ప్రభు పాల్గొన్నారు.