మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి
పాపన్నపేట, ఫిబ్రవరి15 : తెలంగాణ ఉద్యమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర సాధనలో తనవంతు కృషి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న గిరిజనుల ఆరాధ్య దైవమైన జగదాంబదేవి, సేవాలాల్ ఆలయ భూమి పూజా కార్యక్రమంలో అత్యంత వైభవంగా కన్నుల పండువగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి వేర్వేరుగా హాజరై మాట్లాడారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని జగదాంబాదేవి ఆలయం, సేవాలాల్ ఆలయాలను నిర్మించడం శుభపరిణామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, కడుబీదలై, సొంత గృహాలు లేని వారికి గృహాలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయ నృత్యంలో పాల్గొని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌లఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కుభేరుడు, కొత్తపల్లి సహకార సంఘం చైర్మన్ రమేశ్, నార్సింగి సర్పంచ్ ప్రమీలా గోపాల్‌రెడ్డి ఇతర గ్రామాల సర్పంచ్‌లు శ్రీనాథ్‌రావు, వెంకట్రాములు, అనూరాధ ఏడుకొండలు, స్రవంతి శ్రీనివాస్, ఏడుపాయల పాలక మండలి మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు గౌస్, టీఆర్ఎస్ నాయకులు, సాతెల్లి బాలాగౌడ్, పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొన్నారు.