శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Jun 28, 2020 , 02:59:23

మొక్కల పెంపకం సామాజిక బాధ్యత

మొక్కల పెంపకం సామాజిక బాధ్యత

  • విరివిగా నాటి సంరక్షించుకోవాలి
  • హరితహారంలో అధికారులు,   ప్రజాప్రతినిధుల పిలుపు

కాగజ్ హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా భావించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ఆరో విడుత హరితహారంలో భాగంగా శనివారం పట్టణంలోని 6, 23 వార్డుల్లో కౌన్సిలర్లు పిరిసింగుల జైచందర్, బొద్దున విద్యావతి, సత్యనారాయణ, బంక శివకుమార్ కలిసి మొక్కలు నాటారు. అనంతరం ట్రీగార్డులను ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పట్టణంలో ప్రతి ఇంటికీ ఆరు చొప్పున మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. మొక్కలు అవసరమున్న వారికి మున్సిపల్ కార్యాలయంలో అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు క్రాంతి, శ్రీనివాస్, టీఆర్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 

జైనూర్: మొక్కలతోనే సకల జీవకోటికి ప్రాణవాయువు అందుతుందని, మనుగడ సాధ్యమవుతుందని ఎస్ తిరుపతి పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా శనివారం మండలంలోని శివ్ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటా మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుభాష్, నాయకులు సందీప్, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. 

కాగజ్ రూరల్: మండలంలోని ఎన్జీవోస్ కాలనీ, కొత్తసార్సాల గ్రామాల్లో గ్రామస్తులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యదర్శులు, గ్రామస్తులు పుల్ల అశోక్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.