రేషన్ బియ్యంలో పురుగులు
సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ప్రజలకు పురుగుల పట్టి న రేషన్ బియ్యం ఇచ్చి ప్రజా ఆగ్రహానికి గురువుతున్నారు. మండలంలోని చౌదర్పల్లి రేషన్ షాపునకు శుక్రవారం 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం వచ్చాయి. శనివారం లబ్ధిదారులకు బియ్యం ఇవ్వడానికి సంచులు తీయగా అందులో పురుగులు, నూకలే కనిపిస్తున్నాయని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు..
- చౌదర్పల్లిలో 220క్వింటాళ్ల పాడైన నూకల బియ్యం
- తినలేక ఆకలితో చావాలంటూ లబ్ధిదారుల ఆగ్రహం
మహ్మదాబాద్, ఏప్రిల్ 4 : సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ప్రజలకు పురుగుల పట్టి న రేషన్ బియ్యం ఇచ్చి ప్రజా ఆగ్రహానికి గురువుతున్నారు. మండలంలోని చౌదర్పల్లి రేషన్ షాపునకు శుక్రవారం 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం వచ్చాయి. శనివారం లబ్ధిదారులకు బియ్యం ఇవ్వడానికి సంచులు తీయగా అందులో పురుగులు, నూకలే కనిపిస్తున్నాయని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడునెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు..
అం దులో పురుగులు ఉంటే ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. 35 కిలోల రేషన్ బియ్యంలో 10కిలోల నూకలు ఉంటున్నాయని ప్రజలు ఆరోపించారు. ఇలాంటి బియ్యం పశువులు కూడా తినలేవని ప్రజలు ఎలా తింటారని కొందరు బియ్యం తీసుకోకుండానే తిరిగి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో కొంతమంది అలాగే తీసుకెళ్లినట్లు వారు పేర్కొన్నారు. పాత స్టాక్ సంచులను పంపించడం వల్లే ఇలా పురుగులు ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మూడు నెలలు పురుగుల బియ్యం తినలేక ఆకలితో చావాలా అంటూ కొంతమంది గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి బియ్యంతో ఏమి చేయాలి
పురుగులు, నూకలు ఉన్న బి య్యం ఇస్తే ఈ బియ్యం ఏమి చేయాలని బర్రెలకు దాణా పె డ్తే కూడ తినలేవు. ఇలాంటి బి య్యం గవర్నమెంట్ ఎలా ఇ స్తుంది. ఏ సంచి తెరిచి చూ సి నా పురుగులు, నూకలే కనిపిస్తున్నాయి. ఇలాంటి బియ్యం వండి పిల్లలకు ఎలా పెట్టాలి ఆకలితో పిల్లల
కడుపు మాడ్చాల్సి వస్తుంది.
-పూజారి మంజుల, లబ్ధిదారురాలు, చౌదర్పల్లి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

