జోగులాంబ గద్వాల : జిల్లాలోని కేటీ దొడ్డి మండలం పాతపాలెం గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు ( Accused arrest ) చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మొగులయ్య ( DSP Mogulaiah) విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 16న బోయ అనిత అనే మహిళ అనుమానస్పదంగా మృతి చెందడంతో అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.
అనిత, రంగస్వామి మధ్య కొద్దిరోజులుగా అక్రమ సంబంధం ఉండగా ఇటీవల అనిత తీరులో మార్పు గమనించిన రంగస్వామి ఆమెను అనుమానించి గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించాడని డీఎస్పీ తెలిపారు. కేటీ దొడ్డి పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టగా రంగస్వామి హత్య చేసినట్టు అంగీకరించాడని వివరించారు. నిందితుడిని అరెస్ట్ చేసిరిమాండ్ కు తరలిస్తునట్టు వెల్లడించారు.