Missing | అచ్చంపేట రూరల్ : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఓ యువతి అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. ఏఎస్ఐ నర్సింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రాబాద్ మండలం బికె ఉప్పనుంతలకు చెందిన గంటల రవీందర్ కుమార్తె (19) ఆదివారం అచ్చంపేట మండలం దుబ్బతండా గ్రామంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. రాత్రి అందరూ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తెల్లారే సరికి యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు సిద్ధాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.