మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్‌తోపాటు మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసకదాయంలో పడింది. ఈసారి అ న్ని పార్టీల నుంచి భారీగా ఆశావహులు పోటీ చేసేందుకు రం గం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయా పార్టీలు టికెట్లు కేటాయింపులు వర్గాలుగా విడిపోవడంతో గెలుపు గుర్రాలకు టికెట్లు లభించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ చూసినా గందరగోళం నెలకొన్నది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధితోపాటు 18 మున్సిపాలిటీలో కూడా తిరుగుబాటు అభ్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ పార్టీని భుజాన వేసుకోవడంతో అసలు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ఈ పంచాయితీ ఏకంగా పీసీసీ వరకు వెళ్లింది. ఇక ఆయా పార్టీలో టికెట్ రాని వాళ్లంతా బీజేపీలోకి చేరి పోటీకి దిగుతున్నారు. మున్సిపాలిటీలో బలం లేకున్నా బీజేపీ నేతలు టికెట్లు కేటాయించడం వివాదాస్పదంగా మారుతున్నది. ఇదిలా ఉండగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి సతాల్త చూపేందుకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. ఇక అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మూడు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇక మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం గడువు ముగిస్తుండడంతో పార్టీలు బుజ్జగింపులు ప్రారంభించాయి. టికెట్ వస్తుందని ఆశతో నామినేషన్లు వేసిన వారందరినీ ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీలు కోరుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఆయా మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారు. దీంతో ఎవరెవరు ఫైనల్లో మిగులుతారో అనేది ఉత్కంఠగా మారింది.
పాలమూరు కార్పొరేషన్లో రగడ..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో అధికార పార్టీ టికెట్లు కేటాయించడంలో చూపిస్తున్న వివక్ష కారణంగా అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ వా దుల మధ్య గందరగోళానికి దారితీస్తోంది. ఉపసంహరణకు గడువు ముగుస్తున్న తమకు టికెట్లు కేటాయించడంతో సోమవారం డీసీసీ ఆఫీస్ కార్యాలయం చేరుకొని హంగామా సృష్టించారు. తాము కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ కష్టపడిన తమకు టికెట్లు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. అయితే స్థానిక ఎమ్మెల్యేతోపాటు డీసీసీ అధ్యక్షుడు ఇతర ము ఖ్య నేతలు ఎవరూ లేకపోవడంతో అక్కడే ఉన్న మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్‌ను నిలదీశారు. కొంతమంది తమకు టికెట్లు ఎందుకు ఇవ్వడంలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు దీనికంత కారణమైన వ్యక్తులకు నాయకులను తిట్టి పోశారు. మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ ఏకంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్, సురేందర్ రెడ్డి డౌన్‌డౌన్ అంటూ కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. ఎంత సముదాయించినా వినలేదు. మరోవైపు పదవులపై ఆశ ఉన్న చాలామంది నేతలు టికెట్లు తీసుకొని ఎవరి డివిజన్లో వారు ప్రచారం చేసుకుంటున్నారని తమను మాత్రం రోడ్డున పడేశారని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిస్థితి ఇలాగే ఉంటే మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కల్పిస్తున్నాయి.
పకడ్బందీ ప్రణాళికతో బీఆర్ఎస్ అడుగులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కార్పొరేషన్‌తో పాటు 18 మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తుంది. మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు, మున్సిపల్ ఇన్చార్జి ఆంజనేయగౌడ్తోపాటు మిగతా నేతలంతా కలిసికట్టుగా గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయించారు. తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా వారిని బుజ్జగించి అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చా రు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌పై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. 60 డివిజన్లో అభ్యర్థులను ఏకగ్రీవంగా సెలెక్ట్ చేసి.. మిగతా ఆశవాహులకు నచ్చజెప్పి పార్టీని గెలిపించుకోరావాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఇక మిగితా మున్సిపాలిటీలో కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతోపాటు చైర్మన్ స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, బీజేపీకి బలం లేకపోవ డం బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశాలు. అంతేకాకుండా ప ట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కూడా తీవ్రంగా ఉండడంతో అది కూడా అనుకూలంగా మారింది.
అలంపూర్‌పై చల్లా మార్క్..
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఎమ్మె ల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయుడితో కలిసి స్థానిక నేతలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి టికెట్లను కేటాయించారు. అలంపూర్‌తో పాటు వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సగం స్థానాల్లో బీఆర్ఎస్ పాగా వేసింది. ఇక పార్టీ సింబల్‌పై జరిగి ఎన్నికలు కావడంతో మూడు మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే విజయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేడే ఉపసంహరణకు గడువు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కార్పొరేషన్‌తో పాటు 18 మున్సిపాలిటీలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు రంగంలో ఉన్నారు. ఇక టికెట్లు రాని చాలామంది ఆశావహులు వివిధ పార్టీల నుంచి బీ ఫాంలు తెచ్చుకొని పోటీకి దిగుతున్నారు. అయితే ప్రధాన పార్టీలన్ని బీఫాంలు దక్కని వారిని బుజ్జగిస్తున్నారు. టికెట్లు ఇచ్చిన వా రికి ప్రచారం నిర్వహించి గెలుపునకు కృషి చేస్తే భవిష్యత్‌లో పార్టీ సేవలు ఉపయోగించుకుంటుందని నచ్చ చెబుతున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. సా యంత్రం కల్లా పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ప్రకటిస్తారు.