అచ్చంపేట రూరల్ : నిరాడంబరుడు, తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసిన యోధుడు కామ్రేడ్ సుందరయ్య (Puchalapalli Sundarayya) అని సీపీఎం ( CPM) జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ నాయక్( Desanaik) అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్యవర్ధంతిని అచ్చంపేట పట్టణంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సుందరయ్య తన భూమిని పేదలకు పంచిన మానవతావాది అని కొనియాడారు.
సుందరయ్య ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. 20 ఏళ్ల పాటు పార్లమెంటు, అసెంబ్లీలలో నిరంతరం ప్రజల సమస్యల పై మాట్లాడేవారని అన్నారు. నెహ్రూ లాంటి వ్యక్తులు ప్రశంసించిన గొప్ప వ్యక్తని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమిర్శంచారు.
కార్యక్రమంలో సీపీఎం నాయకులు సైదుల్, గింజల మార్కెట్ హమాలీ అధ్యక్షుడు లక్ష్మయ్యజంగయ్య, రాములు, శివకుమార్ గింజల మార్కెట్ కార్యదర్శి రేణు గౌడ్, వెంకటయ్య, రవి నాయక్, తులసి రామ్, లచ్చిరాం, పాండు, రాజు, బీమ్లా, లక్ష్మణ్ , కార్మికులు తదితరులు పాల్గొన్నారు.