
మహబూబ్‌నగర్, డిసెంబర్ 6 : పాలమూరును అ న్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రగతిపథంలో నిలుపుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కా ర్యాలయంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక నిర్ణయా లు తీసుకొని వాటి అమలు దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ను అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చుకుందామన్నా రు. ఎంవీఎస్ కళాశాల మైదానంలో రూ. 3.5 కోట్లతో నూతన స్టేడియాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని రహదారులకు ఇరువైపులా మొ క్కలు నాటాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఫిష్, మీ ట్ మార్కెట్లో రూ.3 కోట్లతో నూతన మార్కెట్‌ను ని ర్మించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.8 కోట్ల ఖర్చుతో చేపట్టిన స్లాటర్ హౌస్ నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పెద్ద మొక్కలను రోడ్డు మధ్యలో నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద సమీకృత మార్కెట్ నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించాలన్నారు.
పట్టణంలోని ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హన్వాడ మండలంంలో నూతనంగా 500 ఎకరాల్లో నిర్మించనున్న ఫుడ్‌పార్కు పనుల్లో వేగం పెంచాలన్నారు. అప్పన్నపల్లి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి కారణంగా ఇండ్లు కోల్పోయిన వా రికి డబుల్ బెడ్రూం ఇం డ్లు, భూములపై చర్చించారు. నూతనంగా ని ర్మించే కాంప్లెక్స్ కారణం గా ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండకుండా చర్యలు తీ సుకోవాలన్నారు. చిన్నద ర్పల్లి నుంచి ధర్మాపూర్ వరకు చేపట్టే నూతన బై పాస్‌రోడ్డు తుది రూపం ఇచ్చి జాతీయ రహదారులు, ఇతర పథకం లో పూర్తికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తు ఎలా ఉండాలో, ఎలాంటి చర్య లు తీసుకోవాలనే అంశాలను పరిగణలోకి తీసుకుని రోడ్‌మ్యాప్ తయారు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి..
రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ పిలుపునిచ్చారు. వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న అంబేద్కర్ వి గ్రహం వద్ద కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లతో కలిసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపర్చిన విధంగానే చి న్న రాష్ర్టాలు ఆవిర్భవించాయని తెలిపారు. స్వరాష్ట్ర సా ధనకు ముందు తాగునీరు, విద్యుత్, ఇతర సమస్యలు ఎన్నో ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దళితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. అక్కడక్కడ అసమానతలు కొనసాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూ డాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగులు పొందిన వారు పేదల కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహు లు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, అధికారులు యాదయ్య, ఇందిర, ఛత్రు, ఆర్డీవో పద్మశ్రీ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, అధికారులున్నారు.
కేంద్రం న్యాయం చేయాలి..
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ టీఎస్ నేతలతో కలిసి ‘చలో ఢిల్లీ’ కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ మౌనంగా ఉం డడం సరికాదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వం ద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని నాడు చెప్పి.. నేడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్, నేతలు నరేశ్, జయన్న, యాదయ్య, సాయికుమార్, రవి, రాజు పాల్గొన్నారు.
ఆరోగ్యంగా ఉండాలి..
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని ఆరోగ్యంగా జీవించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో వీరన్నపేటకు చెందిన ఎం. జ్యోతికి రూ.2 లక్షలు, బేబి అశ్వినికి రూ.లక్షా50 వే లను సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇచ్చిన వాగ్ధానం మేరకు ఏనుగొండలోని రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర (బధిరుల) పాఠశాలకు రూ.10 లక్షల చెక్కును రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్‌కు మంత్రి అందించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, సీపీ వో దశరథం, ఆర్అండ్బీ డీఈ సంధ్య, పీఆర్‌ఈఈ నరేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.