దామరగిద్ద, మే 14 : విధులు సక్రమంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఆశ కార్యకర్తలకు శనివారం స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానలో నిర్వహించిన కార్యక్రమానికి డాక్టర్ లేకపోవడంతో విధులకు రాకుంటే ప్రజలకు సేవలు ఎలా అందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసి డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో రామ్మనోహర్రావును ఆదేశించారు.
అనంతరం ఉల్లిగుండం గ్రామంలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను సందర్శిం చి మౌలిక వసతులకు ఇప్పుటి వరకు ఉన్న నిధులు సరిపోవు అని తెలుపడంతో రూ.30లక్షలు మంజూరు చేశారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు పాఠశాలలో ఉండాలని, ప్రభుత్వ అన్ని పాఠశాలలను బాగు చేసి విద్యార్థులకు మౌ లిక వసతులతోపాటు నాణ్యమైన విద్యను కూడా అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలల వల్లే తయారు చేయాలన్నదే ముఖ్య లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్‌ఎంపీపీ దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ కిషన్‌రావు, సర్పంచ్ కిష్టారెడ్డి, ఆశ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ, మే 14 : ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చర్లపల్లి పాఠశాలలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ను అందించాలనే ప్రారంభించారని పేర్కొన్నారు. గిరిజనులు అధికంగా ఉండే మారుమూల ప్రాంతమైన చర్లపల్లి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కొండాపూర్ నుంచి చర్లపల్లి వరకు బీటీ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించి పూ ర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీఈవో లియాఖత్ అలీ, సర్పంచ్ రాము, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ బాలరాజు, వైస్ ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.