జూరాలకు ఉధృతంగా వరద
- 93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- 19 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
- లక్షా 10 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

ఆత్మకూరు: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని జూరాల రిజర్వాయర్‌కు వరద ఉధృతంగా వస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయ ర్లు పూర్తి నీటిమట్టం సామర్థ్యం చేరుకోగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 20 గేట్ల ద్వారా 1, 20,800 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండగా జూరాల ప్రాజక్ట్‌కు 93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయ్యింది. దీంతో మధ్యాహ్నం వరకు 13 గేట్లు ఎత్తి ఉండగా సాయంత్రానికి 19 గేట్లను ఎత్తి 75,943 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఎడమ కాలువకు 820 క్యూసెక్కులు, కుడి కాలువకు 672, సమాంతర కాలువకు 1,000, భీమా (సెకండ్)కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 31, 365 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఎగువ జూరాలలో 5 యూనిట్ల ద్వారా 9.927 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 166.306 మి.యూ ఉత్పత్తి జరిగింది.
దిగువ జూరాలలో 6 యూనిట్ల ద్వారా 4.665 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 182.758 మి.యూ విద్యుదుత్పత్తి జరిగింది. ప్రాజక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా 8.107 టీఎంసీల నీటిమట్టాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాజక్ట్ నుంచి1,10,618 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతుంది.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

