ఆత్మకూరు పట్టణంలోని శిరిడి సాయిబాబా ఆలయంలో వనపర్తి జిల్లా కొలతల తునికల జిల్లా అధికారి ధనరాజ్ సత్యనారాయణ గురువారం నాడు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నర్వమండలం చిన్నచింతకుంటకు చెందిన బంగారు శ్రీనివాసరావు ఆలయంలో అన్నదాన చేశారు. ఆత్మకూరులోని శిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న జిల్లా కొలితల తూనికల ప్రత్యేక అధికారి సత్యనారాయణ సాయిబాబాను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయించారు.
ఈ సందర్భంగా మందిరం కార్యదర్శి దివాన్ జి ప్రభాకర్ రావు ఆయనను పూలమాల శాలువాతో సన్మానించారు. శిరిడి సాయిబాబాను దర్శించుకుని పూజలు నిర్వహించడం తనకు ఎంతో ప్రశాంతతను, సంతోషాన్ని కలిగించాయని ధనరాజ్ చెప్పారు. దైవ సన్నిధిలో కాసేపైనా గడిపితే మనసు ఎంతో తేలిక పడుతుందన్నారు.