కొత్తకోట: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం భూత్కూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. మండలానికి సంబంధించిన 14మందికి 9,03,800 విలువేన చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఆకుల శ్రీను, మార్కెట్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ బాలనారాయణ, యాదయ్యసాగర్, నాయకులు భీంరెడ్డి, మైబు, వెంకటన్నగౌడ్, నాగేశ్వర్‌రెడ్డి, బాలకొండయ్య పాల్గొన్నారు.