Crime News | జలాశయంలో యువతి, వివాహితుడి మృతదేహాలు.. కారణం అదేనా?
Crime News | నీటితో నిండి ఉన్న జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించడం ప్రజల్లో కలకలం రేపింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది. గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించాయి.

వనపర్తి: నీటితో నిండి ఉన్న జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించడం ప్రజల్లో కలకలం రేపింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది. గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించాయి. వీటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఒక యువతి, ఒక యువకుడి మృతదేహాలు జలాశయంలో ఉండటం స్థానికులు గుర్తించారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన అధికారులు.. మృతదేహాలను బయటకు తీశారు. ఒక యువతి, ఒక వివాహితుడి మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. గురువారం నాడు వీళ్లిద్దరూ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో నరేశ్ (25), కల్యాణి (17) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు నరేశ్.. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వాడని గుర్తించడం జరిగింది. కల్యాణిది కల్వకుర్తి. నరేశ్‌కు ఆరేళ్ల కిందటే వివాహమైంది. అతనికి 6 నెలల పాప కూడా ఉంది. అయినా వీళ్లిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో దారుణ నిర్ణయం తీసుకొని, ఆత్మహత్య చేసుకున్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

