అలంపూర్, జనవరి 12 : యువత స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతంగా ఎదగాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆదివారం అలంపూర్ పట్టణంలో స్వామి వివేకానంద యూత్ సొసైటీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరం, హెల్త్‌క్యాంప్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతుకుముందు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రా ణదాతలు కావాలని యువకులకు పిలుపునిచ్చారు. అనంతరం ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రో త్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు వెం కటేశ్ యాదవ్, కార్యదర్శి సంజీవనాయుడు, పోలీస్ చిన్నయ్య, జితేందర్‌గౌడ్, వెంకట్రామయ్యశెట్టి, శేఖర్‌రెడ్డి, ముస్తఫా, సూరి, మనోహర్, కర్ణ, ప్రశాంత్ పాల్గొన్నారు.
దేశ సంస్కృతిని చాటిచెప్పిన మహనీయుడు..
జడ్చర్ల, జనవరి 12 : దేశ సంస్కృతిని చాటిచెప్పిన స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్లలోని వాల్మీకి నగర్లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాదేపల్లి పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, కిశోర్‌గౌడ్, చైతన్య, లత, నవనీత కొండల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు మురళి, యాదయ్య, దానిష్, నాగిరెడ్డి, ఇమ్మూ, కృష్ణారెడ్డి, అంజిబాబు, బాలు, భరత్, నిజాం, భరత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆదర్శంగా తీసుకోవాలి
భూత్పూర్, జనవరి 12 : వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ వివేకానందుడిని మించిన దేశ భక్తుడు లేడన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, మాజీ సర్పంచ్ నారాయణగౌడ్, ఆంజనేయులు, వివిధ పార్టీల నాయకుడు సుదర్శన్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, సరోజ్‌రెడ్డి, సత్యయ్యగౌడ్, సత్యనారాయ ణ, అశోక్‌గౌడ్, వెంకట్రాజ్, బాల్‌రెడ్డి, మల్లే శ్, పాఠశాల కరస్పాండెంట్ నర్సింహులు ఉన్నారు.
సూక్తులు ఎంతో ప్రభావితం
నారాయణపేట, జనవరి 12 : ప్రతిఒక్కరూ స్వామి వివేకానందునిడి ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన సూక్తులు ఎంతో మంది ని ప్రభావితం చేశాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నా రు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, ప్రతాప్‌రెడ్డి, రాములు పాల్గొన్నారు.