దేవరకద్ర : మండల కేంద్రంలోని ఈశ్వర వీరప్పయ్య స్వామి(Veerappayya Swamy ) ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని(Rathotsavam) భక్తులు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అఖండ భజనలు, అడుగుల భజనలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని నిర్వహించారు.
రథోత్సవంపై స్వామిమూర్తులను ప్రతిష్టించి పట్టణంలోని పురవీధుల గుండా రథోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు పంచామృత అభిషేకం నిర్వహించి స్వామివారికి మహాలంకరణ చేశారు . భక్తుల గోవింద నామస్మరణతో మండలంలో మారిమోగిపోయింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా ప్రజా ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.