వనపర్తి టౌన్, జూలై 17 : జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీబీఎస్ షాపింగ్ మాల్‌ను బుధవారం సినీ తార వైష్ణవి చైతన్య, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని రంగ థియేటర్ ఎదురుగా ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, జ్యువెలరీ షాపును వారు ప్రారంభించారు. షాపింగ్ మా ల్ కలియతిరిగి దుస్తులు, బంగారు ఆభరణాలను ధరించి ప్రదర్శన ఇచ్చారు.
అనంతరం బయట ఏర్పాటు చేసిన వేదిక వద్ద అభిమానులకు అభివాదం చేస్తూ పుష్ప, బేబీ సినిమా డైలాగ్‌లతో ఆమె అభిమానులను ఉత్సాహపరిచారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన గావించి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాగల మహేశ్, బీఆర్ఎస్ అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, షాపింగ్ మాల్ నిర్వాహకుడు సురేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ తదితరులు ఉన్నారు.