వెల్దండ : తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలన్నదే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ (Uppala Trust ) ఉద్దేశమని ట్రస్టు సభ్యులు సిద్ధగోని రమేష్ గౌడ్ ( Ramesh Goud ) అన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్, కుందారం తండా, లాలుతాండాలో ఉప్పల ట్రస్టు ద్వారా గర్భిణులకు ( Pregnant Women ) మెడికల్ కిట్లు ( Medical Kits ) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో గర్భిణులు ఆరోగ్యంగా ఉండడానికి మెడికల్ కిట్లు అందజేస్తున్నట్లు రమేష్ గౌడ్ తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తాడని , తల్లి ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రతి ఊరిలో కిట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు పరమేష్ గౌడ్, కుమార్, జాఫర్, ఆర్కే గౌడ్, నరసింహ, పరమేష్, నిరంజన్, లింగం, రాథోడ్ రమేష్, దాంలా నాయక్, వెంకటేష్ నాయక్, లక్ష్మణ్ నాయక్, కొర్ర నాను నాయక్, ఆశావర్కర్లు ఉన్నారు.