ప్రశాంతంగా పోలింగ్
జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అవకాశం కల్పించారు.
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో సజావుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
- మొత్తం 52 పోలింగ్ కేంద్రాలు
- గద్వాల జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం, పాలమూరులో అత్యల్పం
- పర్యవేక్షించిన కలెక్టర్లు, ఎస్పీలు
- హైదరాబాద్కు చేరిన బ్యాలెట్ బ్యాక్స్లు
- 16న లెక్కింపు
- జిల్లావ్యాప్తంగా 88.01శాతం పోలింగ్
- మోడల్ హైస్కూల్లో పోలింగ్కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రవినాయక్
వనపర్తి
- మొత్తం ఓట్లు1,335
- పోలైన ఓట్లు1,248
గద్వాల
- మొత్తం ఓట్లు877
- పోలైన ఓట్లు852
కందనూలు
- మొత్తం ఓట్లు1,822
- పోలైన ఓట్లు1,712
నారాయణపేట
- మొత్తం ఓట్లు664
- పోలైన ఓట్లు618
పాలమూరు
- మొత్తం ఓట్లు 3,461
- పోలైన ఓట్లు 3,046
మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. మొత్తం 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బరిలో 21 మంది అభ్యర్థులు ఉండగా.. 8,159 మంది ఓటర్లు ఉన్నారు. పొద్దుగాల మందకొడిగా సాగినా సమయం ముగిసే సరికి పోలింగ్ ఊపందుకున్నది.అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 97.15 శాతం ఓట్లు పోలవగా.. తర్వాత నాగర్కర్నూల్ జిల్లాలో 93.96శాతం, వనపర్తిలో 93.48 శాతం, నారాయణపేటలో 93.07 శాతం, మహబూబ్నగర్లో 88.01 శాతం నమోద య్యాయి. కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తనిఖీ చేశారు. టీచర్లు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, మెడికల్, ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాల లెక్చరర్లు ఓటేశారు. ప్రక్రియ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను బందోబస్తు మధ్య అధికారులు హైదరాబాద్కు తరలించారు. 16న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం ముగియడంతో ఎన్నికలు జరిగాయి.
మహబూబ్నగర్, మార్చి 13: జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లావ్యాప్తంగా 88.01శాతం పోలింగ్ ప్రక్రియ నమోదైనది. జిల్లాకేంద్రంలోని బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాల్లో ఉ దయం 9 నుంచి అత్యధికంగా ఓటర్లు ఓటుహక్కు ను వినియోగించుకునేందుకు వచ్చారు. 10గంటల వరకు 19.2శాతం పోలింగ్ సాగింది. మధ్యాహ్నం 12గంటల వరకు 42.33 శాతం ఓటింగ్ జరుగగా, మధ్యాహ్నం 2గంటల వరకు 64.32శాతం ఓటింగ్ సాగింది. పోలింగ్ ముగిసేసరికి జిల్లావ్యాప్తంగా 88.01శాతం పోలింగ్ జరిగింది.
పోలింగ్ కేంద్రాల వద్ద సందడి

పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉపాధ్యాయ సం ఘాల నేతల సందడి కనిపించింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటేసే ఓటర్లకు కనీసం ఒక్కరికీ 5నిమిషాల సమయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా 15పోలింగ్ కేంద్రాంల్లో సాగింది. జిల్లాకేంద్రంలోని మోడల్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రవినాయక్ పరిశీలించారు. పోలింగ్ శాతాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలను ఇచ్చాయని, ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు ముగిసినట్లు కలెక్టర్ తెలిపారు. బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ నరసింహా ప్రత్యేకంగా పరిశీలించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని ఎస్పీ తెలిపారు.
బాలుర కళాశాలలో రాత్రి వరకు..
మహబూబ్నగర్, మార్చి 13: జిల్లాకేంద్రంలో బాలుర కళాశాలలోని పోలింగ్ కేంద్రం 40లో 806మందికిగానూ 714మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 41లో 859ఓట్లకు గానూ 756ఓట్లు పోలింగ్ జరిగింది. 43లో 907ఓట్లకు గానూ 769ఓట్లు పోలయ్యాయి. ఈ మూడు కేం ద్రాల్లో అత్యధిక ఓటర్లు ఉండడంతో అలస్యంగా పోలింగ్ ముగిసింది. రాత్రి 7:15గంటల వరకు ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
- జిల్లావ్యాప్తంగా 15పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 3461మంది ఓటర్లకుగానూ 3046మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 88.01శాతం పోలింగ్ శాతం నమోదైనది.
- జిల్లాలోని ఆయా మండలాల్లో పోలింగ్
- జడ్చర్ల మండలంలో మొత్తం 422 ఓట్లకు గానూ 404ఓట్లు పోలయ్యాయి. 95.7శాతం పోలింగ్ నమోదైంది.
- అడ్డాకుల, మూసాపేట మండలంలో 35మంది ఓటర్లకు గానూ, 30మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 88శాతం పోలింగ్ నమోదైనది.
- చిన్నచింతకుంట మండలంలో 14మందికిగానూ 14మంది ఓటేశారు. వందశాతం పోలింగ్ నమోదైనది.
- దేవరకద్ర, కౌకుంట్ల మండలంలో 28మంది ఓటర్లకు గానూ 26మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 98శాతం పోలింగ్ నమోదైనది.
- మహ్మదాబాద్, గండీడ్ మండలాలల్లో 177మంది ఓటర్లు ఉండగా 109మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
- నవాబ్పేట మండలంలో 18మందికి గానూ 18మంది ఓటేశారు. 100శాతం పోలింగ్ నమోదైనది.
- బాలానగర్ మండలంలో 31ఓట్లకుగానూ 26మంది వినియోగించుకున్నారు.
- కోయిలకొండ మండలంలో మొత్తం 36 ఓట్లకుగానూ 33మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 92శాతం పోలింగ్ నమోదైనది.
- భూత్పూర్ మండలంలో 51ఓట్లు ఉండగా 48ఓట్లు పోలయ్యాయి. దీంతో 94శాతం పోలింగ్ నమోదైనది.
- మిడ్జిల్ మండలంలో 16ఓట్లకుగానూ 15మంది వినియోగించుకున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

