జడ్చర్లటౌన్/బాలానగర్/రాజాపూర్/మక్తల్‌టౌన్/దామరగిద్ద/కోయిలకొండ/మూసాపేట/కృష్ణ/నవాబ్‌పేట, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం జడ్చర్లలో వేర్వేరు గా పలువురు నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులోని వివేకానందుడి విగ్రహానికి జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్యతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, వాసవీక్లబ్ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే బాదేపల్లి సరస్వతీ శిశుమందిరం పాఠశాలలో వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలానగర్ మండలం ఉడిత్యాలలో గ్రామపెద్దలు, ఛత్రపతి శివాజీ యూత్ సభ్యుల ఆధ్వర్యం లో వివేకానంద జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే రాజాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో వివేకనందస్వా మి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గాన్‌పల్లిలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వివేకనందస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మక్తల్ పట్టణంలో స్వామి వివేకానంద జయంతిని పురసరించుకొని శుక్రవారం ఘనం గా నివాళులర్పించారు. ప్రాథమిక పాఠశాలలో హె చ్ఎం శ్రీనివాసరెడ్డి 150 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. దామరగిద్ద మండల కేంద్రంతోపాటు మల్‌రెడ్డిపల్లిలో వివేకానంద స్వా మి జయంతిని ఘనంగా నిర్వహించారు. కోయిలకొండ మండలకేంద్రంలో స్వా మి వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అడ్డాకుల మండల కేం ద్రంలోని వివేకానందుడి విగ్రహాంతోపాటు, ఆయా గ్రామాల్లోని ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు ప్ర జాప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వి వేకానంద జయంతిని పురస్కరించుకొని మూసాపేటలో శుక్రవారం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బస్టాండ్ ఆవరణ లో పలువురు నాయకులు వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణ మం డల కేంద్రంలో శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవాబ్‌పేట మండల కేంద్రంతో పాటు మరికల్, చౌడూర్, కూచూర్, కారుకొండ గ్రామాల్లో శుక్రవారం వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు.
దేవరకద్ర రూరల్ (కౌకుంట్ల)/దేవరకద్ర, జనవరి 12 : స్వామి వివేకానందను యువత ఆదర్శం గా తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో ఎమ్మెల్యే వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేవరకద్ర మండలంలోని గోపన్‌పల్లిలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గోపన్‌పల్లికి చెందిన సురేందర్‌రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 12 : యువతకు స్వామి వివేకానంద జీవితం స్ఫూర్తిదాయకమని డీవైఎస్వో శ్రీనివాస్ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. వివేకానంద విగ్రహానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ఇన్చార్జి విజయ్‌కుమార్, సిబ్బంది హరిప్రసాద్, కౌసల్య, విజయలక్ష్మి, ఖలీల్, ఇమ్రా న్, అజహర్ పాల్గొన్నారు.
మరికల్, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మరికల్ మండల కేంద్రంలోని యువక మండలి ఆధ్వర్యంలో రక్తదా న శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గౌని సురేఖారెడ్డి మాట్లాడుతూ యువకులు రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. అంతకుముందు యువక మం డలి సభ్యులు స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అప్పంపల్లికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి, లావణ్య దంపతులు గతంలో పెండ్లి మండపంలో రక్తదానం చేసినందుకు గానూ వారిని ఘనంగా సన్మానించా రు. ధన్వాడ మండల కేంద్రంలో ఏబీవీపీ అధ్వర్యం లో బస్టాండ్ ప్రాంగణంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్ధ న్, ఎంపీటీసీ గోపాల్, యువక మండలి అధ్యక్షుడు రవికిరణ్, కార్యదర్శి రాఘవేందర్ పాల్గొన్నారు.
భూత్పూర్, జనవరి 12 : పట్టణంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అలాగే వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో మండలంలోని తాటికొండలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో 20 మంది రక్తదానం చేసినట్లు సంఘం అధ్యక్షుడు నరేందర్ తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సత్తూ ర్ నారాయణగౌడ్, సంఘం సభ్యులు ఉన్నారు.
నర్వ, జనవరి 12 : మండల కేంద్రంతోపాటు యాంకి, పెద్దకడ్మూర్, కల్వాల గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం స్వామి వివేకానంద జ యంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మక్తల్ మండలంలోని జక్లేర్‌లో లయన్స్ క్లబ్ మండలాధ్యక్షుడు అంబదాస్రావు ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో సర్పంచులు శశిరేఖ, సంధ్య, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, జనవరి 12 : జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల, వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలతోపాటు పలు ప్ర భుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.