అచ్చంపేట, డిసెంబర్ 28 : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య పెరిగింది. పెద్ద పులుల సంఖ్య 40 వరకు చేరినట్లు అధికారుల అంచనా.. నల్లమల అందాలను తిలకించేందుకు వెళ్తున్న సఫారీ యాత్రికులకు ఈ మ ధ్య కాలంలో రెండు సార్లు పులులు మార్గమధ్యంలో కనిపించాయి. శనివారం ఉదయం యాత్రికులను సఫారీ వాహనంలో ఫారెస్ట్ అధికారులు తీసుకొని వ్యూపాయింట్‌కు వెళ్తుండగా మార్లమధ్యలో వెహికిల్‌కు అతి సమీపంలో పులి కనిపించింది.
కొద్దిసేపు రోడ్డుపై నిలబడి మెల్లగా రోడ్డుమార్గం మీదుగా ము ందుకు వెళ్లి అడవిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వా త సఫారీ వాహనం ముందుకు కదిలిం ది. వాహనంలో ఉ న్న సందర్శకులు పులి కదలికల ను.. పులి కనిపించే వరకు సెల్ఫోన్లలో ఫొటోలు తీసి వీడియోలు చిత్రీకరించా రు. ప్రత్యక్షంగా చూడడంతో వారి ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి.
ఇదే నెల 19న సైతం సఫారీ టూ ర్కు వెళ్లిన యాత్రికులకు వ్యూపాయింట్ సమీపంలో గుండం వద్ద పులి కనిపించింది. ఒకే నెలలో రెండుసార్లు పెద్దపులి కనిపించడంతో సఫారీ టూర్‌కు వ చ్చేందుకు సందర్శకులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యల కారణంగానే ఏటీఆర్ఎఫ్లో పెద్ద పులుల సంఖ్య పెరిగింది. ఫరహాబాద్ నుంచి వ్యూపాయింట్ వరకు సఫారీ టూర్‌కు వాహనంలో విహరించేందు కు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.