మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 29 : జిల్లా కేంద్రంలోని స్టేడియంలో మంగళవా రం 43వ రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో చాం పియన్షిప్ పోటీలు ఉత్కంఠగా కొనసాగా యి. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రెండోరోజు హోరాహోరిగా సాగిన పోటీలు లీగ్ కం నా కౌట్ పద్ధతిలో నిర్వహించిన టోర్నీ రాత్రి ఫ్లడ్లైట్స్ వెలుతురులో సెమీఫైనల్ మ్యాచ్ కొనసాగించారు. బాలికల విభాగంలో ఆదిలాబా ద్ జట్టు 24-04 తేడాతో ఖమ్మం జట్టుపై గె లుపొందగా, మెదక్ జట్టు 14-12 తేడాతో కరీంనగర్‌పై, నల్లగొండ జట్టు 20-08 తే డాతో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ జట్టు 36-02 తేడాతో నిజామాబాద్‌పై, రంగారెడ్డి జట్టు 28-8 తేడాతో మెదక్ గెలుపొందాయి.
బాలుర కేటగిరీలో ఆదిలాబాద్ జట్టు 36-24 తేడాతో ఖమ్మంపై, మెదక్ జట్టు 28-24 తేడాతో కరీంనగర్‌పై, వరంగల్ జట్టు 30-20 తేడాతో నల్లగొండపై, రంగారెడ్డి జట్టు 22-18 తేడాతో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ జట్టు 24-14 తేడాతో హైదరాబాద్‌పై, మెదక్ జట్టు 36-30 నిజామాబాద్‌పై గెలుపొందాయి. బుధవారం ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి.
బాలుర విభాగంలో రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్.. బాలికలలో అదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి సెమీఫైనల్స్‌కు చేరాయి. నేడు ఫైనల్ మ్యాచ్ కొనసాగనున్నది.