జోగులాంబ గద్వాల: గద్వాల ( Gadwala) నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రానికి చెందిన ఒకరి ఇంటిలో ఫ్రిడ్జ్ సిలిండర్ పేలి ( Cylinder explosion) ముగ్గురికి గాయాలయ్యాయి. అడవి ఆంజనేయులు ఇంటిలో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు సునీత, అశ్వినీకి, మరో చిన్నారికి గాయాలయ్యాయి . వారిని హుటాహుటినా జిల్లా కేంద్రంలోని దవఖానాలో చేర్పించి అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.