హన్వాడ : పిచ్చికుక్క దాడిలో ( Dog attack) ముగ్గురు చిన్నారులు ( Childrens injured ) తీవ్రంగా గాయపడ్డ ఘటన హనువాడ మండలంలోని వేపూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులు ఇంటి దగ్గర ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేయడంతో ఒక చిన్నారికి ముఖం, మరొకరికి తల, ఇంకొకరికి కాలుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారుల కుటుంబ సభ్యులు హన్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరారు.