మక్తల్, జూన్ 5 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తాము సర్వం కో ల్పోతామని, అందుకే ఎకరాకు రూ.70 లక్షల చొ ప్పున పరిహారం ఇస్తేనే మా భూములు ఇస్తామని లేదంటే ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లికి చెందిన రైతులు ఆర్డీవోకు తెగేసి చెప్పారు. గురువారం మక్తల్ మండలం కాట్రేవుపల్లి ఆర్డీవో రాం చంద్రనాయక్ ఆధ్వర్యంలో భూములు కోల్పోతు న్న రైతులతో అభిప్రాయ సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ పేట- కొడంగ ల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కో ల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ సర్వే కు రైతులు సహకరించాలని కోరగా అం దుకు ఒప్పుకోమని ప్ర కటించారు. గతంలోనే భూత్పూర్ రిజర్వాయ ర్ నిర్మాణంలో 300 ఎకరాలకుపైగా భూ ములు కోల్పోయి రో డ్డున పడ్డామని, మిగిలినభూమిని కూడా పేట-కొడంగల్ ప్రాజెక్టు ఇస్తే మేం ఎలా బతకాలని ప్రశ్నించారు.
అందుకే ప్రభు త్వం ఎకరాకు రూ.70లక్షల పరిహారం అందించడంతోపాటు కాట్రేవుపల్లి గ్రామాన్ని ఆర్ఆర్య సెంటర్‌గా మార్చి భూములు కోల్పోతున్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డి మాండ్ చేశారు. రైతులెవరూ అధికారులకు సహకరించకపోవడంతో రైతుల సంతకాలు లేకుండానే సమావేశాన్ని ముగించా రు.
అనంతరం ఎర్నగానిపల్లిలో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్ట గా ఆ గ్రామ రైతులు కూడా ఎకరాకు రూ.50 నుంచి 70 లక్షల పరిహారాన్ని అందిస్తేనే పేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి భూ ము లు ఇస్తామని చెప్పారు. దీంతో అక్కడి నుంచి కూడా రైతులు వెనుదిరిగారు. స మావేశాల్లో కార్యక్రమంలో తాసీల్దార్ సతీశ్‌కుమార్, నీటిపారుదలశాఖ డిప్యూ టీ ఇంజినీర్ సతీశ్‌కుమార్, ఏఈ శివ, ఆర్ఐ రాములు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.