వనపర్తి, జనవరి 22 : మద్యం మత్తులో తండ్రి ని కొడుకు హతమార్చిన ఘటన వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. సీఐ మహేశ్వర్రావు కథనం మేరకు.. గ్రా మానికి చెందిన తెలుగు బచ్చన్న (85)కు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కొడుకు కురుమన్న మద్యం మత్తులో సోమవారం ఉదయం భార్య లక్ష్మిని కొట్టడంతో రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చే సింది.
కాగా, మధ్యాహ్నం మళ్లీ ఫుల్లుగా తాగి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రిపై గొడ్డలి తో దాడి చేయగా అక్కడిక్కడే మృతిచెందాడు. చు ట్టుపక్కల వారు కురుమన్నను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.