మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 17 : పాలమూరు విశ్వవిద్యాలయం.. అంతా మిథ్యాలయంగా మారుతోందా..? అంటే అవుననే పరిస్థితులు ప్రజాపాలన ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్నాయి. బో ధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో కీలక భూమిక పోషించే ఆచార్యుల నియామకాలు అటకెక్కాయి. ఉన్న కొంతమంది ఉద్యోగ విరమణ పొందడంతో స మస్య మరింత తీవ్రమవుతోంది.
పాలమూరు యూ నివర్సిటీలో అన్ని విభాగాల్లో కలిపి 84మంది ఆచార్యులకు గానూ 22 పోస్టులు భర్తీకి నోచుకోగా.. ప్ర స్తుతం 17మంది మాత్రమే అందుబాటులో ఉన్నా రు. 5 మందిలో నలుగురు ఉద్యోగ విరమణ పొం దగా.. ఒకరు రిజైన్ చేశారు. రెండు నెలల కిందట ప్ర భుత్వం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తామని హడావుడి చేసి మార్గదర్శకాలతో జీవో విడుదల చేసినా.. నేటికీ ఎక్క డ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నది.
విశ్వవిద్యాలయంలో మొత్తం 17 విభాగాల్లో 19 కోర్సులు ఉన్నాయి. ప్రతి విభాగంలో ఒక ఆచార్యుడు విధిగా ఉండాలనే నిబంధన. నియామకాలు లేక బోటనీ, బిజినెస్ మేనేజ్మెంట్, కెమిస్ట్రీ, కామర్స్, ఆంగ్లం, గణితం, మైక్రోబయాలజీ, ఫా ర్మసీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, తెలుగు విభాగాల్లో ఆచార్యుల పోస్టులు మొత్తం ఖాళీగానే ఉన్నాయి.
సహ ఆచార్య, సహాయ ఆచార్య పోస్టుల పరిస్థితి అదే. పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా జోగుళాంబ-గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని పీజీ సెంటర్లలో కూడా ఆచార్యుల పోస్టులను భర్తీ చేయలేదు. పోస్టుల భర్తీ లేకపోవడంతో బోధన, పరిశోధన, పరిపాలన పరంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ కారణంగా న్యాక్ గ్రేడ్లను మెరుగుపర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రజాపాలనలో పాలకమండలి కన్పించడం లేదు..
ఆర్థిక, అభివృద్ధి పరమైన అంశాల్లో నిర్ణయం తీసుకునేందుకు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను సైతం ప్రభుత్వం ఏడాదిగా ఏర్పాటు చేయడం లేదు. ఇందులో 13మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఉం టుంది. ఎక్స్ అఫిషియో సభ్యులు 5మంది విద్యాశాఖ, ఆర్థికశాఖ, ఉన్నత విద్య కార్యదర్శులు, వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్ ఉంటే నామినేటెడ్ సభ్యులు 8 మంది సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. అందులో యూనివర్సిటీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇటీవల యూనివర్సిటీకి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించినా.. కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలే దు. నిధుల ఖర్చు, కొత్త భవనాల నిర్మాణం, సిబ్బం ది వేతనాలు తదితరవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
పోస్టులు మంజూరైనా ఖాళీలే..
యూనివర్సిటీలో బోధనకు గానూ మొత్తం 84 అధ్యాపక పోస్టులు మంజూరు చేశారు. వా టిలో ప్రొఫెసర్ పోస్టులు-7 మంజూరు కాగా ప్రస్తుతం అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్-14 పోస్టులకు గానూ 12ఖాళీలు ఉన్నాయి. 63 అసిస్టెం ట్ ప్రొఫెసర్ పోస్టులకు 48 ఖాళీలు ఉన్నాయి.
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నిరాశే..
రెండు నెలల కిందట ప్రభుత్వం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తామని హడావుడి చేసి మా ర్గదర్శకాలతో జీవో విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల వల్ల తమకు నష్టం జరుగుతుందని కాం ట్రాక్ట్ అధ్యాపకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టారు. అన్ని ర కాలైన అర్హతలు ఉన్న తమకు మొదటి ప్రాధాన్య ఇవ్వడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
వారికి న్యాయం చే స్తామని ఊరడించిన ప్రభుత్వం మళ్లీ అటువైపు దృష్టి సారించకపోవడంతో వారంతా నిరాశలోనే ఉన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను సకాలంలో భర్తీ చేయకపోవ డం వల్ల యూ నివర్సిటీ ప్రమాణాలు పడిపోతున్నాయని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఆచార్యుల పోస్టుల ఖాళీలు, పాలకమండలి లేకపోవడంతో యూనివర్సి టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు పాలన కుంటుపడటంతో మెరుగైన విద్య అందని ద్రాక్షగానే మారుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
బోధనేతర సిబ్బంది సమస్యలు తీర్చాలి
పీయూ బోధనేతర సిబ్బంది వేతన పెంపు నిలిచిపోయింది. పాలకమండలి త్వరగా ఏర్పాటు చేసి బోధనేతర ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి. డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. బోధనేతర సిబ్బందికి న్యాయం చేస్తానని వైస్‌చాన్స్‌లర్ హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా కృషిచేస్తున్నారు. తమకు త్వరలో తీపికబురు అందుతుందని ఆశిస్తున్నాం.
-జేఆర్ రామ్మోహన్జీ, పీయూ బోధనేతర సిబ్బంది, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి
కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి. ఖాళీలను కొత్తవారితో భర్తీ చేయాలి. కొత్తవాళ్లు వస్తే.. వారికి పాతవారు ఉపయుక్తంగా ఉంటారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద విద్యార్థుల ఉన్నతవిద్యకు ఆధారంగా పాలమూరు యూనివర్సిటీ ఉన్నది. అటువంటి విద్యాలయాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు.
– శ్రీరామ్‌నాయక్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి, పీయూ
ఇబ్బందులు తొలగించాలి
పాలమూరు యూనివర్సిటీలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా అధ్యాపకుల ఖాళీలు. వీటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తే మెరుగైన విద్య అందుతుంది. నూతన భవనాలు నిర్మించినా పూర్తిస్థాయిలో వసతులు సమకూర్చలేదు. హాస్టల్స్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి.
-గౌతమి, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, పీయూ
అధ్యాపకులను రెగ్యూలర్ చేయాలి
కాంట్రాక్టు అధ్యాపకులుగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ వా రిని ఉద్యోగులుగా, ఉన్నత స్థాయి అధికారులు తీర్చిదిద్దుతున్నాం. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇక్కడే పనిచేస్తున్నాం. చాలా వరకు వయోపరిమితి సైతం ముగిసే దశలో ఉన్నారు. అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంతో పాటుఉద్యోగ భద్రత కల్పించాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో మొదటి ప్రాధాన్యత మాకు ఇచ్చాక.. మిగిలిన పోస్టులను కొత్తవారితో భర్తీ చేయాలి.
-శేకుంటి రవికుమార్, పీయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు