కాలచక్రం గిర్రున తిరిగింది. కష్టసుఖాలు, మంచి చెడులు, తీపి, చేదు అనుభవాలతో 2023 ఇట్టే గడిచిపోయింది. కోటి ఆశలతో 2024 వచ్చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు సంబురాలు ప్రారంభించారు. యువత కేరింతలు కొ డుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. న్యూ ఇయర్ కే కుల కొనుగోళ్లతో బేకరీలు, మద్యం దుకాణా లు, తీరొక్క రంగుల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కళకళలాడాయి. అందరి మొబైల్స్‌లో వాట్సా ప్, ఫేస్బుక్, మెస్సేంజర్, ఇన్స్టాగ్రాంలలో ‘న్యూ ఇయర్ శుభాకాంక్షలు’ సందేశాలు వెల్లువెత్తాయి.
ప్రతిఒక్కరూ బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు విషెస్ తెలిపారు. డ్యాన్స్‌లు చే స్తూ హోరెత్తించారు. సామూహికంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సందడి చేశారు. మహిళలు ముగ్గులు వేసి తమ ఇంటి వాకిళ్లను అందంగా తీర్చిదిద్దా రు. సోమవారం తెల్లవారుజామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి, అమ్మవార్ల దర్శనాలకు భక్తులు పోటెత్తారు. మొత్తమ్మీద కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు.