Achampet | అచ్చంపేట, జూన్ 22 : ఆశా వర్కర్ దేవి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బైక్ మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన కాట్రావాత్ దేవి కుటుంబాన్ని ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రెసిడెంట్ రజిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అచ్చంపేట మండలం పెద్ద తండా గ్రామానికి చెందిన ఆశా వర్కర్ దేవి డ్యూటీ అయిపోయాక తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బైక్ నుంచి జారిపడి మరణించడం వారి కుటుంబానికి తీరనిలోటు ఆశా వర్కర్ యూనియన్ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేవి గారికి సంతాపాన్ని ప్రకటించారు. ఆశా వర్కర్లు ప్రభుత్వానికి ఎల్లవేళలా వైద్య పరంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో వైద్య సేవలు అందించే విషయంలో ముందున్న ఆశా వర్కర్లకు అనుకోకుండా ప్రమాదము జరిగి మరణిస్తే బీమా, ఉద్యోగ భద్రత లేకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల ఆలోచన చేసి ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు నిర్మల, సాయిలీల, రోజా, సావిత్రి, సైదమ్మ, నిర్మల, రాములమ్మ, లక్ష్మమ్మ, సావిత్రి ఉన్నారు.