ఎదురు చూపులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసినా.. నేటికీ జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గౌరవ వేతనాలు చెల్లించండి మహాప్రభో అంటూ స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధులు వేడుకుంటున్నారు. ఈనెల 4వ తేదీ నాటికి ఐదేం డ్ల టర్మ్ పూర్తవగా..
- పదవి ముగిసింది.. వేతనం నిలిచింది
- ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం
- ఆరు నెలలుగా అందని గౌరవ వేతనాలు
- వనపర్తి జిల్లాలో రూ.67 లక్షలు పెండింగ్
- ఆర్థిక ఇబ్బందుల్లో తాజా మాజీ ప్రజాప్రతినిధులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసినా.. నేటికీ జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గౌరవ వేతనాలు చెల్లించండి మహాప్రభో అంటూ స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధులు వేడుకుంటున్నారు. ఈనెల 4వ తేదీ నాటికి ఐదేం డ్ల టర్మ్ పూర్తవగా.. దాదాపు ఆరు నెలల గౌరవ వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి నెలా అందేవని, కాంగ్రెస్ హయాంలో ఎదురుచూపులు త ప్పడం లేదని వాపోతున్నారు. ఒక్క వనపర్తి జిల్లాలోనే 144 మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ స భ్యులు ఉండగా.. రూ.67 లక్షలు అం దాల్సి ఉంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
– వనపర్తి, జూలై 12 (నమస్తే తెలంగాణ)
ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనాలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రజాప్రతినిధికీ గౌరవ వేతనం చెల్లించలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశాలకు రావడం.. సంతకాలు పెట్టడం తప్పా ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనాలకు మాత్రం నోచుకోవడంలేదు. జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీపీ లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు కలిసి మొత్తం 144 మంది ఉన్నారు.
రూ.67 లక్షలు పెండింగ్..
జిల్లాలో పనిచేసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులకు ఇచ్చే గౌరవ వేతనాలు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. వీరిలో జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులకు నెలకు రూ.13 వేలు, ఎంపీటీసీలు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులకు ప్రభుత్వం రూ.6,500 గౌరవ వేతనం చెల్లిస్తున్నది. అయితే వీరికి బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఎప్పటికప్పుడు చెల్లించింది. ఎలాంటి బకాయిలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ రు నెలలుగా వీరికి గౌరవ వేతనం చెల్లించడం లేదు. సమావేశాలు జరిపినా, చివరకు వారి పదవీ కాలం ముగిసినా గౌరవ వేతనాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా జిల్లాలోని వివిధ హోదాల్లో పని చేసిన ప్రజాప్రతినిధులకు ఆరు నెలలకు సంబంధిం చి దాదాపు రూ.67 లక్షల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. వీటి కోసం చాలా మంది ప్రజాప్రతినిధులు ఎదురు చూడకపోయినా, కనీసం గౌరవ వేతనాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ముగిసిన పదవీ కాలం..
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని స్థాయిల ప్రజాప్రతినిధుల పదవీ కాలం దాదాపు ముగిసింది. ఐదేండ్ల్లుగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పదవు ల్లో కొనసాగారు. గత ఫిబ్రవరిలోనే సర్పంచుల పదవీకాలం ముగిసింది. జూలై 4తో జెడ్పీటీసీలు, జూలై 3తో ఎంపీటీసీల గడువు సమాప్తమైంది. ప్రస్తుతం అంతా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు ప్ర త్యేకాధికారులు నియామకమయ్యారు.
త్వరలోనే వేతనాలు చెల్లిస్తాం
జిల్లా పరిషత్, మండల పరిషత్లకు సంబంధించిన ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు త్వరలోనే వస్తాయి. ప్రస్తుతం ఆరు నెలలుగా పెండింగ్ ఉన్నాయి. వీటిలో మూడు నెలల వేతనాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో వారి అకౌంట్లలో జమ అవుతాయి. కార్యాలయం నుంచి చేయాల్సిన పనులను సిద్ధం చేశాం. వీటి అనంతరం మరో మూడు నెలల వేతనాలు మాత్రమే పెండింగ్లో ఉంటాయి. వాటిని వీలైనంత త్వరగా అందించే ప్రయత్నం చేస్తాం.
– యాదయ్య, జెడ్పీ సీఈవో, వనపర్తి జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

