మక్తల్ ఫిబ్రవరి 16 : తెలంగాణ ప్రగతిశీల హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ రాష్ట్ర నాలుగవ మహాసభల గోడపత్రికను సీఐటీయూ(CITU) జిల్లా అధ్యక్షుడు ఎస్ కిరణ్ ఆవిష్కరించారు. ఆదివారం ఆయన మక్తల్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రగతిశీల హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి 21న జరిగే మహాసభలకు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు.
వ్యవసాయ మార్కెట్ సివిల్ సప్లై, మార్బుల్స్, ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు, మార్కెట్ రైల్వే, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్లలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చట్టబద్ధత కల్పించలే దన్నారు. కార్మికుల హక్కులను సాధించడం కోసం, వారి సంక్షేమా వర్తింపు కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి కార్మికునికి కనీస వేతనం 26,000 అందేటట్లు జీవోలు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మన్న, అయ్యప్ప, రాజు, నాగప్ప, నరసింహ, రాజు, ఎర్రం జప్ప, తదితరులు ఉన్నారు.