మక్తల్, ఏప్రిల్ 29 : టోల్గేట్ పేరు మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. కాచ్వార్ పేరును తొలగించి టేకులపల్లి పేరు పెట్టాలని రైతులు, గ్రామస్తులు కోరారు. మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జాతీయ రహదారి-167పై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టేకులపల్లి శివారులో హైవేపై నిర్మించిన టోల్‌గేట్‌కు టేకులపల్లి పేరు కాకుండా.. సంబంధం లేని కాచ్వార్ పేరును పెట్టడం సరికాదన్నారు.
గ్రామానికి సమీపంలో ఉండడంతో టేకులపల్లిగా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాతో రహదారిపై వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో విషయం తెలుసుకొన్న మక్తల్ పోలీసులు అక్కడకు చేరుకొని వారికి నచ్చజెప్పారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. టోల్‌గేట్‌కు కాచ్వార్ పేరును తొలగించి వెంటనే టేకులపల్లి పేరు పెట్టాలని మక్తల్ తాసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.