గద్వాల అర్బన్, నవంబర్ 22 : ధరూర్ మండలంలోని జాంపల్లి గ్రామ శివారు ప్రాంతంలో శుక్రవారం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు మృతి చెందిన ఘటన విధితమే. కాగా ఈ ఘటన హత్య చేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసినట్లు మండలంలో పెద్ద మొ త్తంలో పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో భీమరాయుడికి గ్రామంలోని మరో వర్గానికి ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై వివాదాలు ఉన్నట్లు సమాచారం. దీం తో పాటు రాజకీయ పరంగా కూడా భీమరాయుడు అడ్డు తగులుతుండడంతో ఆయన అడ్డు తొలగించేందుకు గ్రామంలోని ఒక వర్గం వారు హత్య చేసేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. అం దులో భాగంగానే భీమరాయుడుని గత మూడు రో జుల నుంచి కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
శుక్రవారం భీమరాయుడు తన బైక్‌పై గద్వాలకు వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన అతని ప్రత్యర్థులు ఒక బొలేరో వాహనంతో ఢీ కొట్టి హత్య చేసిన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా యి. శనివారం పోస్టుమార్టం అనంతరం భీమరాయుడు మృతదేహాన్ని ఖననం చేసేందుకు శవయాత్ర చేస్తున్న క్రమంలో భీమరాయుడు కుటుంబ సభ్యు లు నందిన్నె గ్రామంలోని ఓ రైస్ మిల్లుపై రాళ్లు రు వ్వారు. భీమరాయుడిని అన్యాయంగా చంపేశారం టు మిల్లుపై దాడి చేసేందుకు వెళ్లగా పోలీసులు అదు పు చేశారు.
గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితి దాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీస్‌లు గ్రామంలో పోలీస్ ఫికెట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదు పు తీసుకున్నట్లు తెలిసింది. అదుపులో మిల్లు నిర్వహకుడి కొడుకుతోపాటు వాహన డ్రైవర్ మరో ఇద్దరిని పోలీస్‌లు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే భీమరాయుడిని ఢీ కొట్టిన వా హన డ్రైవర్ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క ర్నూల్ జిల్లాకు చెందినది గుర్తించారు. ఈ వాహనం నెంబర్‌తోనే మరొకటి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుపారీలో భాగంగా ఓ వ్యక్తి వాహన డ్రైవర్‌కి అడ్వాన్స్ రూపంలో ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపినట్లు తెలిసింది. ఈ విషయంపై సీఐ శ్రీను వివరణ కోరగా.. భీమరాయుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.