మరికల్ : మరికల్ మండల కేంద్రంలోని శ్రీవాణి విద్యా మందిర్లో( Srivani Vidya Mandir) పదో తరగతి పరీక్షల్లో 500 పై మార్కులు సాధించిన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి మనోరంజని ఆదివారం సన్మానించారు. కావేరి అనే విద్యార్థినికి 545 మార్కులు, మల్లేశ్వరి 539 మార్కులు , సంధ్య అనే విద్యార్థులను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి 500 పై మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యలోనూ రాణించాలని సూచించారు. కృషి, పట్టుదలతో పాటు ఏకగ్రత, క్రమశిక్షణతో జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వినీతమ్మ, కరస్పాండెంట్ పూర్ణిమా వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.