మరికల్ : మరికల్ మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ( Summer training camp) నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ( DEO Govindarajulu ) బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంలో చేపట్టిన కార్యక్రమాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆసక్తి నైపుణ్యాన్ని పరిశీలించారు.
వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. షెడ్యూలు ప్రకారం తరగతుల నిర్వహణ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మనోరంజని, పీఎం శ్రీ బాలురావు ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ నాగరత్నమ్మ, మండల ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.