మక్తల్ : తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ( Uttam Kumar reddy ) , రాష్ట్ర క్రీడ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వాకిటి శ్రీహరి ( Vakiti Srihari ) బుధవారం ప్రియదర్శిని జూరాల, సంగం బండ, భూత్పూర్ రిజర్వాయర్ల భూ నిర్వాసితులతో ముఖాముఖీ అయ్యారు.
మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడారు. భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని వెల్లడించారు.
తాము పడుతున్న ఇబ్బందులను రైతులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. రైతులు అధైర్య పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని వారికి భరోసానిచ్చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన మంత్రులు సంగం బండ, భూత్పూర్ రిజర్వాయర్లను జూరాల బ్యాక్ వాటర్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.