మహబూబ్‌నగర్, డిసెంబర్ 30 : నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భం గా మరింత ఉత్సాహంగా మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేసుకుందామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి మ ఠంలో పట్టణ విశ్వబ్రాహ్మణ మనుమయ సం ఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ పాలమూరును మున్ముందు మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను శాలువా, గజమాలతో సత్కరించారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలో భూత్పూర్ రహదారిపై ఏర్పాటు చే స్తున్న సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి పరిశీలించారు. లైటింగ్ పనులతో మొక్కల పెంపకానికి ఆటంకం ఏర్పడకుండా చూడాలని సూ చించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఏఈ సుబ్రహ్మణ్యం, డీసీసీబీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు గోవింద్, రాంలక్ష్మణ్, కిశో ర్, విశ్వబ్రాహ్మణుల సంఘం జిల్లా అధ్యోగు లు వడ్ల శేఖర్, పట్టణ అధ్యక్షుడు రాఘవాచారి, ప్రధానకార్యదర్శి రఘుచారి, కోశాధికారి రవికుమార్, ఉపాధ్యక్షులు పాండాచారి, చి రంజీవి, యాదయ్య, రాజేంద్రచారి, రఘు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ జయరామ కంపెనీ సీఈవోకు అభినందన
శ్రీరామ జయరామ కంపెనీని ఉన్నతస్థాయికి చేర్చేందుకు కృషి చేస్తున్న సీఈవో విక్రంయాదవ్ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శ్రీరామ జయరామ అధినేత బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి బెక్కరి బాలకృష్ణారెడ్డి ఆయి ల్ ఇంజన్ మెకానిక్‌గా పనిచేసి రైతులకు ఎన్నోసేవలు అందించారని గుర్తు చేశారు. తన తండ్రి స్ఫూర్తితోనే శ్రీరామ జయరామ కంపె నీ ద్వారా రైతుల ట్రాక్టర్లకు ఉచితంగా మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రాజమూర్తి, సర్వీస్ జనరల్ మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు అండగా ఉంటా
ఉ పాధ్యాయులకు అండగా ఉండి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. పీఆర్టీయూ టీఎస్ రూపొందించిన నూత న సంవత్సర క్యాలెండర్, డైరీని గురువారం యూనియన్ కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణగౌడ్, రఘురాంరెడ్డి, గౌరవాధ్యక్షులు గోపాల్‌నాయక్, గోపాల్‌గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు హరినాథ్, జైపాల్‌రెడ్డి, బుచ్చారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని చంద్రశేఖర్, రేవతి, సావిత్రి, రాంచంద్రయ్య, పురుషోత్తంగౌడ్, రమాదేవి పాల్గొన్నారు.