ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో శ్రీ సీత రామలక్ష్మణ (Sri Sitaramalakshmana idol) , ఆంజనేయ, వాల్మీకి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.స్థానిక వాల్మీకి సంఘం( Valmiki Sangam) ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట, అభిషేకం, మహా మంగళ హారతి, ప్రత్యేక పూజా తంతు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో దంపతుల చేత హోమం నిర్వహించారు. కన్నుల పండువగా కొనసాగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి( MLA Vakiti Srihari) , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, విగ్రహ దాత రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యజ్ఞేశ్వర్ రెడ్డి, ఎల్కోటి లక్ష్మీకాంత్ రెడ్డి, లింగం, వాల్మీకి సంఘం నాయకులు సంజప్ప, దొబ్బలి హన్మంతు, కే. సంజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.