వరుణుదేవా.. కరుణించవయ్యా..
వానకాలం ప్రారంభమై రెండునెలలు పూర్తయినా సకాలంలో వరుణుడు కరుణించకపోవడంతో రైతులు, పశుపక్షాదులు అల్లాడుతున్నాయి. దేవుళ్లను వేడుకుంటున్నా కరుణించకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. శ్రావణమాసం మొదటి శనివారం కృష్ణా, తుంగభద్ర నదీజలాలతో పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస్వామికి అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు.
- కృష్ణ, తుంగభద్ర జలాలతో అయిజ కట్టకింద తిమ్మప్పస్వామికి పూజలు
- 11 జతల ఎడ్ల బండ్లపై గ్రామానికి నదీజలాల ఊరేగింపు
అయిజ, ఆగస్టు 15 : వానకాలం ప్రారంభమై రెండునెలలు పూర్తయినా సకాలంలో వరుణుడు కరుణించకపోవడంతో రైతులు, పశుపక్షాదులు అల్లాడుతున్నాయి. దేవుళ్లను వేడుకుంటున్నా కరుణించకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. శ్రావణమాసం మొదటి శనివారం కృష్ణా, తుంగభద్ర నదీజలాలతో పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస్వామికి అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు.
పట్టణంలోని పెద్ద ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస్వామి ఆలయం వరకు 11 జతల ఎడ్లబండ్లపై నదీజలాలను భాజా భజంత్రీలు, మేళ తాళాలు, భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండు దశకు చేరుకుంటుండగా, యాసంగిలోనై పంటల సాగుకు కరుణించవయ్యా అంటూ వరుణుడికి భక్తులు పూజలు చేశారు. కార్యక్రమంలో రైతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

