గద్వాల టౌన్, జూన్ 25 : మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తనవంతు విశేష కృషి చేస్తానని కళాశాల అల్యూమిని చైర్మన్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ కళాశాలలో మంగళవారం ఎంఏఎల్‌డీ స్పార్క్ రీసర్చ్ ఆర్టికల్ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హా జరై పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మేధావులను తయారు చేసిన ఘనత ఎంఏఎల్‌డీ కళాశాలకు ఉందన్నారు. తాను కూడా కళాశాల పూర్వ విద్యార్థి కా వడం అదృష్టమన్నారు. కళాశాల పేరును నలుదిశలా చాటిన పూర్వ విద్యార్థులను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఎంతో కృషి చేసి రూ పొందించిన ఎంఏఎల్‌డీ స్పార్క్ పుస్తకం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైందని వివరించారు. అనంతరం వివిధ ప్రాం తాల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే మహిళల విశ్రాంతి గది కలరింగ్ కోసం మార్కెట్ యా ర్డు మాజీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్ రూ.లక్ష విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, అల్యూమిని జనరల్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కలందర్‌బాషా, వైస్ ప్రిన్సిపాల్ శ్రీపతినాయుడు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంపత్‌కుమార్, అధ్యాపకులు కృష్ణమూర్తి, శివారెడ్డి, మనోజ్, హరినాగభూషణం, మంజులత, కౌన్సిలర్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.