గద్వాల, ఆగస్టు 19 : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియ గడువు సోమవారం అర్థరాత్రితో ముగియడంతో సర్‌పై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు కార్యక్రమం ముగియడంతో జిల్లాలో అసలైన ఓటర్ల లెక్క తేలింది. జిల్లాలో మొ త్తం 594(గద్వాల 303, అలంపూర్ 291) పోలింగ్ బూ త్ల పరిధిలో మొత్తం 5,03,859 ఎన్యూమ రేషన్ ఫారా లు పంపిణీ చేయగా సర్ పంపిణీ ప్రక్రియ ముగిసే నాటికి జిల్లాలో 4,39,934మంది ఓటర్లు మాత్రమే బీఎల్వోలకు తమ దరఖాస్తు ఫారాలను అందజేశారు. వీటిని బీఎల్వోలు డిజిటలైజేషన్ పూర్తి చేశారు. మరో 63,925 మంది ఫారాలు అందజేయలేదు.
రెండు సార్లు గడువు పొడిగించినా పూర్తిస్థాయిలో ఓటర్లు తమ దరఖాస్తు ఫారాలను అధికారులకు అందజేయ లేక పోయారు. జిల్లాలో డిజిటలైజేషన్ 87.31శాతం పూర్తయింది. అయితే ఇందు లో కొన్ని ఓట్లు గ్రామీణ ప్రాంతం వారివి ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు కొందరు మరణించగా, మరి కొంద రు ఇతర ప్రాంతాల్లో ఉన్నచోటే అక్కడే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరికొందరూ తమ సొంత గ్రామంతోపాటు జిల్లా కేంద్రంలో ఓటు హక్కు కలిగి ఉండడంతో ఆయా డూప్లికేట్ ఓట్లు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎన్యూమరేషన్ ఫారా లు అందని 63,925ఓట్లు తొలగించే అవకాశం ఉంది. సర్ ప్రక్రియ ముందుగా జూన్ 25నుంచి జూలై 24వరకు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. అయితే కొన్ని చోట్ల 2002 నాటి వివరాలు అందుబాటులో లేకపోవడంతో ప్రక్రియ అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించినా ప్రక్రియ ఆశించిన మేరకు ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి గడువు ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఈ ప్రక్రియ సుమారు 45రోజుల పాటు కొనసాగి సోమవారం నాటికి ముగిసింది. సోమవారం ప్రక్రియ పూర్తికావ డంతో అధికారులు తదుపరి అంశాలపై దృష్టి సారించారు. ఆగస్టు 17వతేదీన ముసాయిదా ఓటర్ల జాబి తా అధికారులు ప్రకటించారు. ముసాయిదా ప్రకటించడంతో ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకుంటున్నారు. మ్యాపింగ్ కాని ఓటర్లకు అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించారు. మ్యాపింగ్ కాని ఓటర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు తీసుకున్న వారు సరైన పత్రాలు చూ పించకపోతే వారి ఓట్లు తుది జాబితాలో తొలగించే అవకాశం ఉంది. వచ్చే నెల 16వ తేదీ లోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని ఓటర్లు, రాజకీయ పార్టీల నేతలకు కలెక్టర్ సూచించారు. అభ్యంతరాలు సరి చేస్తే వాటిని అధికారులు సరి చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 594 పోలింగ్ కేం ద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 5,03,859మంది ఓటర్లు ఉండగా, 4,39,934 మంది(87.31శాతం) మంది ఓట ర్లు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఇంకా 63,925 మంది ఆన్ కలెక్ట్బుల్ ఓటర్లుగా గుర్తించారు. గద్వాల నియోజకవర్గంలో ఐదు మండలాలతోపా టు గద్వాల పట్టణంతో కలుపుకొని 2,61,810 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,21,816మంది ఓటర్లు మాత్రమే తమ ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్వోలకు ఇచ్చారు. ఇంకా 39,994మంది ఓటర్లు తమ ఫారాలను ఇవ్వలేదు. గద్వాల అర్బన్‌లో 66,516 మంది ఓటర్లు ఉండగా 48,583 మంది ఓటర్లు మాత్రమే(72.98) తమ ఎన్యూమరేషన్ పత్రాలు అధికారులకు ఇచ్చారు. అలంపూర్ నియోజకవర్గంలోని 8మండలాల్లో 2,42,049 మంది ఓటర్లు ఉండగా 2,18,118 మంది ఓటర్లు మాత్రమే(90శాతం) తమ పత్రాలు అధికారులుకు అందజేశారు.
దీంతో అలంపూర్ నియోజకవర్గంలో 23, 931 మంది ఓటర్లు బీఎల్వోలకు ఎన్యూరేషన్ ఫారాలు అందజేయకపోవడంతో జిల్లాలో పెద్దఎత్తున ఓటర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. అదే విధంగా సుమారు 1.25లక్షల మంది ఓటర్లు అనామలిస్ లిస్ట్‌లో ఉన్నారు. వీరంతా ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక టి సమర్పించాలని కలెక్టర్ సూచించారు. అయితే ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటరుగా ఉన్న వ్యక్తి ఈనెల 10వ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వకపోతే అతని పేరు డ్రాప్ట్ జాబితాలో లేకపోయినా సదరు వ్యక్తి అభ్యంతరాల స్వీకరణ సమయంలో అధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించింది.అలాగే ఫారం-6తోపాటు డిక్లరేషన్ ఫారం ద్వారా సదరు వ్యక్తి తన పేరు ఓటరు జాబితాలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని కొత్త వ్యక్తికి 18 ఏళ్లు నిండితే సదరు వ్యక్తులు ఫారం-6ద్వారా కొత ్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఎన్నికల సం ఘం కల్పించింది. ఓటర్ల జాబితాలో గల్లంతైన వారు తిరిగి దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందే అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.