మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 3 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ ములను కార్పోరేట్ సంస్థలకు అమ్మడం, అక్కడున్న జాతీయ పక్షి నెమళ్లను, రాష్ట్ర జంతువు కృష్ణ జింకలను చంపుతున్న సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వీ కన్వీనర్ గడ్డం భరత్‌బాబు, ఎస్ఎఫ్ ఐ పీయూ అధ్యక్షుడు బత్తిని రాము డి మాండ్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలోని 400ఎకరాల భూములను కార్పోరేట్ సంస్థలకు వేలం పెట్టి అమ్మడాన్ని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీలో గురువారం ధర్నా చేపట్టి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి పచ్చని మణిహారంగా ఉండి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులను నేలమట్టం చేసి, 400 ఎకరాల యూ నివర్సిటీ భూములను సీఎం రేవంత్‌రెడ్డి కార్పోరేట్ సంస్థలకు అమ్మడం సిగ్గుచేటైన చర్య అని విమర్శించారు. బుల్డోజర్లతో యూనివర్సిటీ అడవులను చదును చేస్తుం టే అక్కడి పక్షులు, జంతువుల అరుపులు వినపడడం లేదా అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూ ములను కాపాడాలని శాంతియుత నిరసనలు చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయ డం దారుణమని అన్నారు. ఎన్నికల సమయంలో హెచ్‌సీయూ చుట్టూ తిరిగిన రా హుల్గాంధీకి సెంట్రల్ యూనివర్సిటీ భూ ముల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటాలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ భూములను కేసీఆర్ పరిరక్షించారని తెలిపారు. విద్యార్థుల పరిశోధనలు, తరగతుల నిర్వహణ, ఇతర విద్యా సంబంధిత అవసరాలకు కొత్త భవనాలను కట్టడానికి స్థలం అవసరమైతే రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. భూముల అమ్మకాన్ని రద్దు చేసేంత వరకు హెచ్‌సీయూ విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తామని విద్యార్థి నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ పాలమూరు యూ నివర్సిటీ నాయకులు ఆంజనేయులు, రా మకృష్ణ, లక్ష్మణ్‌నాయుడు, రాజగోపాల్, రాము, కావేరి, చైత్ర, నవనీత, పూజిత, ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీను, కిరణ్, రామకృష్ణ, రాముడు, కవిత, మాధవి ఉన్నారు.