నారాయణపేట : నారాయణపేట మండల పరిధిలోని షేర్నపల్లి గ్రామంలో గురువారం విద్యార్థులే ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. హెచ్ఎంగా శ్రీహరి, కలెక్టర్గా యశోద, డీఈవోగా శిరీష, ఉపాధ్యాయులుగా చైతన్య, నితిన్, హారతి, ఆనంద్, అజయ్, అనిత, మహాలక్ష్మి, కళ్యాణి, వైష్ణవి, వైశాలి, నవనీత, నర్మద, రాజేష్తోపాటు పలువురు వ్యవహరించారు.
తరగతి గదుల్లో చక్కటి బోధన ప్రదర్శన చేశారు. వీరిని గ్రామస్తులతోపాటు హెచ్ఎం సిరాజ్, ఉపాధ్యాయులు జనార్ధన్, అరవింద్, వెంకటప్ప, వెంకటేష్, స్వప్న అభినందించారు.