ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని రిషి బ్రైట్ కిడ్స్ స్కూల్లో (Rishi Bright Kids School, ) ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ( School Anniversary ) ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి విశాల్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు ఉపన్యాసం, వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు.
కార్యక్రమానికి చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి ముఖ్యఅతిథిగా, లయన్స్ క్లబ్ మాజీ మండల అధ్యక్షుడు ఎల్కోటి జనార్దన్ రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ మొట్కార్ బాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాష్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.
విద్యార్థులను చదువుతో పాటు ఇతర అన్ని రంగాల్లో తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ జీహెచ్ఎం శెట్టి రమేష్, గాండ్ల నీల్ రాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.