నారాయణపేట : విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన నారాయణపేట జిల్లా ఊట్కూర్( Utkoor ) ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ జగదీశ్వర్ రెడ్డిను సస్పెన్షన్ ( Suspension) చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ వార్డెన్ ఈనెల 13న మద్యం సేవించి విధులకు హాజరు కావడమే కాక హాస్టల్ పనివారిని, విద్యార్థులను బూతులు తిట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పరిశీలించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జగదీశ్వర్ రెడ్డి స్థానంలో మద్దూర్ ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ ఎస్. వెంకటేశంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు.