లింగాల, ఏప్రిల్ 3 : తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం క్షేత్ర ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. మూడురోజులుపాటు నల్లమల ప్రాంతం లింగమయ్య నామస్మరణంతో మార్మోగింది. ప్రకృతి సోయగాలు, ఎతైన కొండల మధ్య కొలువుదీరిన లింగమయ్య స్వామి దర్శించుకొవడానికి భక్తులు బారులుతీరారు. వస్తున్నాం.. వస్తు న్నాం.. లింగమయ్య, వెళ్లొస్తాం.. లింగమయ్య అంటూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.
చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు లింగమయ్యను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు. అధికారులు వేసిన అంచనాలు తలకిందులు చేస్తూ లెక్కకు మించి భక్తులు పొట్తేత్తారు. లోయలో ఇరుకైన మార్గం ఉండడంతో తోపులాట చోటు చేసుకోవడంతో ఊపిరాడక కొంతమంది భక్తులు దర్శనం చేసుకొకుండానే వెనుదిరిగారు. క్షేత్రానికి తరలి వెళ్లే భక్తులకు దాతలు చేయూతనందించారు. లిం గాల, ఫర్హాబాద్ మధ్యలో స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, అన్నదానం, తాగునీరు, రాగి అంబలి అందించి ఉదారతను చాటుకున్నారు.
సలేశ్వరం లింగమయ్య క్షేత్రంలో అధికారులు తీవ్రంగా శ్రమించారు. గతంలో సలేశ్వరం క్షేత్రంలో ఐదురోజులపాటు లింగమ య్య దర్శనానికి అనుమతులు ఉండేది. కానీ ప్రస్తుతం మూడురోజులు మాత్రమే అనుమతి ఇవ్వడంతో భక్తులు సంఖ్య అధికంగా పెరిగింది. అధికారుల వేసిన అంచనాలకు మించి ఒక్కసారిగా భక్తులు లక్షల్లో తరలిరావడంతో తోపులాట చోటు చేసుకున్నది. దీంతో కొంతమంది భక్తులు ఊపిరాడక దర్శనం చేసుకోకుండానే వెనుదిరాగాల్సి వచ్చింది. భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో చేసేదేమి లేక పోలీసులు, అధికారులు తీవ్రంగా శ్రమించారు.
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 3 : నాగర్‌కర్నూల్ జిల్లాలోని సలేశ్వరం జాతర భద్రత బందోబస్తును శుక్రవారం జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్ సమీక్షించారు. ఈ సందర్భం గా భక్తుల రద్దీ, ఇబ్బందుల గురించి ఎస్పీ సం గ్రామ్సింగ్ను అడిగి తెలుసుకున్నారు. లోయ లో జారిపడిన వ్యక్తిని క్షేమంగా పైకి తీసుకొచ్చి న పోలీస్‌సిబ్బందిని ప్రశంసించారు. సలేశ్వరం జాతరలో 400 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బం ది కలిగినా వెంటనే పోలీస్ కంట్రోల్‌రూమ్ సంప్రదించాలని సూచించారు.
పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై సంతృ ప్తి వ్యక్తం చేశారు. గురువారం రాత్రి నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబుమియా కాలుజారి ప్రమాదవశాత్తు లోయలోపడిపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై మురళి, కానిస్టేబుళ్లు ఊర్మిళ, మణికళ గమనించి తమ భుజాలపై మోసుకొని గట్టుపైకి తీసుకొచ్చి దవాఖానలో వైద్యం అందించడంపై డీఐజీ ప్రశంసించారు.