అమరచింత, జూన్ 26 : మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఈనెల 29వ తేదీ ఆదివారం తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ దివంగత సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా నూతన కాంస్య విగ్రహావిష్కరణతో పాటు జెడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో నిర్వహించే భారీ బహిరంగసభకు ప్రజలు కుటుంబ సమేతంగా పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర గిడ్డుంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ కోరారు.
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బీఆర్ఎస్ నాయకులు, సాయిచంద్ అభిమానులతో కలిసి ఆమె పట్టణంలోని పది వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సాయిచంద్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ, బహిరంగసభకు సంబంధించిన పోస్టర్లను ప్రజలతో కలిసి విడుదల చేశారు. అనంతరం సాయిచంద్ విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు రమేశ్ ముదిరాజ్, నర్సింహులుగౌడ్, ప్రధాన కార్యదర్శి చిన్నబాల్రాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ నాగభూషణంగౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ లేనిన్, బీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, వనపర్తి జిల్లా కో ఆర్డినేటర్ తోకలి రమేశ్, తెలంగాణ జాగృతి మక్తల్ నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్కలాం పాషా, బీఆర్ఎస్ నాయకులు రవి, చిన్ననర్సింహ, సాయిచంద్ అభిమానులు డీజే శేఖర్, డీసీ రాజశేఖర్ పెద్దఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.