గద్వాల అర్బన్, జూన్ 7 : బస్సులో ప్రయాణించే ప్ర యాణికులు తమ బ్యాగును బస్సులో మరిచిపోగా.. తీరా వారి వివరాలు తెలుసుకొని అందచేసిన ఘటన శనివారం జిల్లా కేంద్రంలోని గద్వాల ఆర్టీసీ బస్సు డిపోలో చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత వివరాల మేరకు.. కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లె బస్సులో గద్వాల మండలంలోని సంగాలకు చెందిన ప్ర యాణికులు గద్వాలకు వస్తున్నారు. ఈ క్రమంలో వారి వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే వదిలి మరిచిపోయారు.
ఈ విషయాన్ని గ్రహించిన బస్సు కండక్టర్ సూ రిబాబు, బస్సు డ్రైవర్ పరశురాములు బ్యాగును డిపో మేనేజర్‌కు అందజేసి తనిఖీ చేయగా అందులో 25 తులాల బంగారు ఆభరాణాలు, రూ.40,000 నగదు, ల్యాప్‌ట్యాప్, వారికి సంబంధించిన కార్డులు కనబడ్డాయి. ప్రయాణికుల వివరాలు తెలుసుకుని డిపో మేనేజర్ చేతుల మీదుగా అందజేశారు.