మరికల్ : మరికల్ మండలంలోని పసుపుల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మైసమ్మ దేవాలయంలో ( Maisamma Temple) విగ్రహ ప్రతిష్టాపనకు ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన నర్సింలు తన తండ్రి ఎర్ర లింగప్ప జ్ఞాపకార్థం రూ. 51 వేలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈనెల 21 నుంచి 23 వరకు గ్రామంలో శివలింగం, నాగదేవత, నవగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, గ్రామ దేవత మైసమ్మ ప్రతిష్టాపన కార్యక్రమాలను దాతల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహ ప్రతిష్టాపనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.